☆ (a + b)2 = a2 + 2ab + b2
☆ (a - b)2 = a2 - 2ab + b2
☆ (a + b)2 = a2 + 2ab + b2
☆ (a - b)2 = a2 - 2ab + b2
3 + 2√5 ను కరణీయ సంఖ్య అని నిరూపించడానికి ముందు క్రింది భావనలను గుర్తుకు తెచ్చుకుందాం.
ప్రతి అకరణీయ సంఖ్యను p/q రూపంలో వ్రాయవచ్చు.
(p, q లు పూర్ణ సంఖ్యలు మరియు q ≠ 0)
ఒక పదాన్ని/ఒక గుణకాన్ని స్థానాంతరం చెందించినపుడు
“+a” ను LHS/RHS వైపుకి మార్చినపుడు “-a” గా మారుతుంది
“-a” ను LHS/RHS వైపుకి మార్చినపుడు “+a” గా మారుతుంది
“ x a” ను LHS/RHS వైపుకి మార్చినపుడు “÷ a” గా మారుతుంది
“÷ a” ను LHS/RHS వైపుకి మార్చినపుడు “x a” గా మారుతుంది
“ x a/b” ను LHS/RHS వైపుకి మార్చినపుడు “ x b/a” గా మారుతుంది
భిన్నాల సూక్ష్మీకరణ:
ఉదాహరణలు:
1. 2/3 + 5 = (2+ 5 x 3)/3 = (2 +15)/3 = 17/3
2. 7 – 5/4 = (7 x 4 – 5)/4 = (28 – 5)/4 = 23/4
3. 3/5 + 4/7=(3x7+4x5)/5x7 =(21+ 20)/35 =41/35
"√2 ని కరణీయ సంఖ్య అని చూపటం"
మరియు "5√2 + 7√3 ను కరణీయ సంఖ్య" అని చూపటం తెలుసుకోవాలి
-------------------------------------------------------------------
3 + 2√5 ను కరణీయ సంఖ్య అని చూపండి.
(దీనిని మనం పరోక్ష పద్ధతి ద్వారా నిరూపిస్తాము)
నిరూపణ:
ప్రతిపాదన: 3 + 2√5 కరణీయ సంఖ్య కాదు అనుకుందాం
అపుడు 3 + 2√5 అకరణీయ సంఖ్య అవుతుంది
∴ 3 + 2√5 = p/q
(p, q లు పూర్ణ సంఖ్యలు మరియు q ≠ 0 )
"+3" ని RHS వైపు వ్రాయగా
2√5 = p/q - 3
(3 ని q చే గుణించగా)
2√5 = (p - 3q)/q
“ x 2” ని RHS వైపు వ్రాయగా
√5 = [(p - 3q)/q] ÷ 2
√5 = [(p - 3q)/q] x (1/2)
√5 = (p - 3q)/2q
p, q లు పూర్ణ సంఖ్యలు కావున
“(p - 3q)/2q” ఒక అకరణీయ సంఖ్య
కాని √5 ఒక కరణీయ సంఖ్య
పై రెండు వాక్యాలు పరస్పరం విరుద్ధాలు
ఈ విరుద్ధతకి కారణం మన ప్రతిపాదన
కావున మన ప్రతిపాదన “3 + 2√5 కరణీయ సంఖ్య కాదు” అనటం తప్పు
∴ 3 + 2√5 కరణీయ సంఖ్య అవుతుంది
--------------------------------------------------
Proof:
Assume that (3√5 + 4) is not an irrational number
So 3√5 + 4 is a rational number
∴ 3√5 + 4 = p/q
Transpose "+4" to RHS
3√5 = P/q - 4
3√5 = (p - 4q)/q ( Multiplied 4 with q)
Transpose " x 3 " to RHS
√5 =[(p - 4q)/q] ÷ 3
√5 =[(p - 4q)/q] x (1/3)
√5 = (p - 4q)/3q
Since p and q are integers,
“(p - 4q)/3q” is a rational number
But √5 is an irrational number
This is a contradiction
This contradiction is arisen due to our assumption
So our assumption is wrong
“ (3√5 + 4) is not an irrational” is wrong
Therefore (3√5 + 4) is an irrational
5√2 + 7√3ను కరణీయ సంఖ్య అని నిరూపించడానికి ముందు క్రింది
భావనలను గుర్తుకు తెచ్చుకుందాం.
ప్రతి అకరణీయ సంఖ్యను p/q రూపంలో వ్రాయవచ్చు.
(p, q లు పూర్ణ సంఖ్యలు మరియు q ≠ 0)
(a + b)2
= a2 + 2ab + b2
(a - b)2
= a2 - 2ab + b2
ఒక పదాన్ని/ఒక గుణకాన్ని స్థానాంతరం చెందించినపుడు
“+a” ను LHS/RHS వైపుకి మార్చినపుడు “-a” గా మారుతుంది
“-a” ను LHS/RHS వైపుకి మార్చినపుడు “+a” గా మారుతుంది
“ x a” ను LHS/RHS వైపుకి మార్చినపుడు “ ÷ a” గా మారుతుంది
“÷ a” ను LHS/RHS వైపుకి మార్చినపుడు “x a” గా మారుతుంది
“x a/b” ను LHS/RHS వైపుకి మార్చినపుడు “x b/a” గా మారుతుంది
భిన్నాల
సూక్ష్మీకరణ:
ఉదాహరణలు:
1. 2/3 + 5 = (2+ 5 x 3)/3 = (2 +15)/3 = 17/3
2. 7 – 5/4 = (7 x 4 – 5)/4 = (28 – 5)/4 = 23/4
3. 3/5 + 4/7=(3x7 + 4x5)/5x7 =(21+ 20)/35= 41/35
మరియు "√2 ని కరణీయ సంఖ్య అని చూపటం" తెలుసుకోవాలి
-------------------------------------------------------------------
5√2 +7√3 కరణీయ సంఖ్య అని చూపండి
(దీనిని మనం పరోక్ష పద్ధతి ద్వారా నిరూపిస్తాము)
నిరూపణ:
ప్రతిపాదన: 5√2 + 7√3 కరణీయ సంఖ్య కాదు అనుకుందాం
అపుడు 5√2 + 7√3 అకరణీయ సంఖ్య అవుతుంది
∴ 5√2 + 7√3 = p/q
(p, q లు పూర్ణ సంఖ్యలు మరియు q ≠ 0 )
" +7√3 " ని RHS వైపు వ్రాయగా
5√2 = P/q - 7√3
ఇరువైపులా వర్గం చేయగా
(5√2)2 = (P/q – 7√3 )2
[(a - b)2 = a2 - 2ab + b2]
52(√2)2= (P/q)2 – 2 x (p/q) x ((7√3) + (7√3)2
[ఇక్కడ a = p/q మరియు b = 7√3 ]
25(2) = (P2/q2) – (14√3)(p/q) + 72(√3)2
50 = (P2/q2) – (14p/q)(√3)+ 49(3)
“– (14p/q)(√3)” ని LHS వైపు వ్రాయగా
50 + (14p/q)(√3)= P2/q2 + 147
“+50” ని RHS వైపు వ్రాయగా
(14p/q)(√3)= P2/q2 + 147 - 50
(14p/q)(√3)= P2/q2 + 97
97 ని q2 చే గుణించగా
(14p/q)(√3) = (p2 + 97q2)/q2
“(14p/q)” ని RHS వైపు వ్రాయగా
(√3) = (p2 + 97q2)/q2 x (q/14p)
(√3) = (p2 + 97q2)/14pq (“q” ని కొట్టి వేయగా)
p, q లు పూర్ణ సంఖ్యలు కావున
“(p2 + 97q2)/14pq” ఒక అకరణీయ సంఖ్య.
కాని √3 ఒక కరణీయ సంఖ్య.
పై రెండు వాక్యాలు పరస్పరం విరుద్ధాలు
ఈ విరుద్ధతకి కారణం మన ప్రతిపాదన
కావున మన ప్రతిపాదన “5√2 + 7√3 కరణీయ సంఖ్య కాదు” అనటం తప్పు
∴ 5√2 + 7√3 కరణీయ సంఖ్య అవుతుంది
---------------------------------------------------------
Proof:
Assume that 5√2 + 7√3 is not an irrational number
So 5√2 + 7√3 is a rational number
∴ 5√2 + 7√3 = p/q
Transpose "+7√3" is to
RHS
5√2 = P/q - 7√3
Squaring on both sides, we get
(5√2)2 = (P/q – 7√3 )2
[Apply (a - b)2 = a2 - 2ab + b2]
52(√2)2= (P/q)2 – 2 x (p/q) x ((7√3) + (7√3)2
[Here a= p/q and b=7√3 ]
25(2) = (P2/q2) – (14√3)(p/q) + 72(√3)2
50 = (P2/q2) – (14p/q)(√3)+ 49(3)
Transpose “– (14p/q)(√3)” to LHS
50 + (14p/q)(√3)= P2/q2 + 147
Transpose “+50” to RHS
(14p/q)(√3)= P2/q2 + 147 -
50
(14p/q)(√3)= P2/q2 + 97
Multiply 97 by q2
(14p/q)(√3) = (p2 + 97q2)/q2
Transpose “ x (14p/q)” to RHS
(√3) = (p2 + 97q2)/q2 x (q/14p)
(√3) = (p2 + 97q2)/14pq (“q” cancelled)
Since p and q are integers,
“(p2 + 97q2)/14pq”
is a rational number
But √3 is an irrational number
This is a contradiction
This contradiction is arisen due to our assumption
So our assumption is wrong
“ 5√2 + 7√3 is not an irrational” is wrong
Therefore 5√2 + 7√3 is an irrational
కరణీయ సంఖ్య అని
నిరూపించడానికి ముందు క్రింది భావనలను గుర్తుకు తెచ్చుకుందాం.
ప్రతి అకరణీయ సంఖ్యను మనం భిన్న రూపంలో వ్రాయవచ్చు. భిన్న రూపం యొక్క కనిష్ట రూపం p ⁄ q అనుకుంటే p, q లు పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. మరియు q ≠ 0 అగును.
పరస్పర ప్రధాన సంఖ్యలు
రెండు సంఖ్యల గ.సా.భా. “1” అయితే ఆ రెండు సంఖ్యలను “పరస్పర ప్రధాన సంఖ్యలు” అంటారు.
పరస్పర ప్రధాన సంఖ్యలకి “1” తప్ప ఇతర ఉమ్మడి కారణాంకాలు ఉండవు
అనగా పరస్పర ప్రధాన
సంఖ్యలకి “1” మాత్రమే ఉమ్మడి కారణాంకం అవుతుంది
సిద్ధాంతం
a ఒక ధన పూర్ణసంఖ్య మరియు p ఒక ప్రధాన సంఖ్య అయితే “a2 ను p నిశ్శేషంగా భాగిస్తే, a ను కూడ p నిశ్శేషంగా భాగిస్తుంది”
భాగహార న్యాయం
విభాజ్యం(a) = విభాజకం(b) x భాగఫలం(q) + శేషం(r)
a=bq + r
శేషం “0” అయితే a=bq అవుతుంది
అపుడు “a ను b భాగిస్తుంది” అని
అంటాము
ఈ సందర్భంలో:
“a” ను “b” మరియు “q” ల యొక్క గుణిజం అంటాము
“b” మరియు “q” లను “a” యొక్క కారణాంకాలు అంటాము
పరోక్ష పద్ధతి
ఈ పద్ధతిని మనం “నిరూపించవలసిన
ఫలితానికి వ్యతిరేఖ ప్రతిపాదన” తో ప్రారంభిస్తాం.
కొన్ని సోపానాల తరువాత, గణిత విరుద్ధ భావన ఏర్పడుతుంది.
దీనికి కారణం మనం తీసుకున్న (ఫలితానికి వ్యతిరేఖ)
ప్రతిపాదన అని గ్రహించాలి
అందువలన మన ప్రతిపాదన తప్పు అని గుర్తించాలి
అపుడు ఇవ్వబడిన వాక్యం సత్యమని నిరూపిస్తాం
-----------------------------------------------------------------------
√2 కరణీయ సంఖ్య అని నిరూపించండి.
(దీనిని మనం పరోక్ష పద్ధతి ద్వారా నిరూపిస్తాము)
నిరూపణ:
ప్రతిపాదన: √2 కరణీయ సంఖ్య కాదు అనుకుందాం
అపుడు √2 అకరణీయ సంఖ్య అవుతుంది
∴ √2 = p ⁄ q
(p, q లు పరస్పర ప్రధాన సంఖ్యలు మరియు q ≠ 0)
ఇరువైపులా వర్గం చేయగా
(√2)2 =
(p ⁄ q)2
2
= p2/q2
2q2 =
p2
p2 =
2q2 (LHS, RHS లను తారుమారు చేయగా)
“p2” ను 2 భాగిస్తుంది
కావున “p” ని కూడ 2 భాగిస్తుంది……….(i)
అనగా “p” అనేది 2 యొక్క గుణిజం
p
= 2k (k ఒక పూర్ణాంకం)
p
= 2k ను 2q2 = p2 లో ప్రతిక్షేపించగా
2q2 =
(2k)2
2q2 =
4k2
q2 =
2k2
“q 2” ను 2 భాగిస్తుంది
కావున “q” ని కూడ 2 భాగిస్తుంది ………….(ii)
(i) మరియు (ii) ల నుండి,
p మరియు q లను 2 భాగిస్తుంది అని తెలుస్తుంది
అనగా p మరియు q లకి 2 ఒక కారణాంకం అవుతుంది
కాని p, q లు పరస్పర ప్రధాన సంఖ్యలు
(వీటికి “1” తప్ప ఇతర ఉమ్మడి కారణాంకాలు ఉండవు)
పై రెండు వాక్యాలు పరస్పరం విరుద్ధాలు
ఈ విరుద్ధతకి కారణం మన ప్రతిపాదన
కావున మన ప్రతిపాదన “ √2 కరణీయ సంఖ్య కాదు ” అనటం తప్పు
∴ √2 కరణీయ సంఖ్య అవుతుంది
క్రింద ఈయబడిన మాదిరి
ప్రశ్నలు చేయటం ద్వారా పూర్తి అవగాహన ఏర్పడుతుంది
1. √3 కరణీయ సంఖ్య అని చూపండి.
2. √5 కరణీయ సంఖ్య అని చూపండి.
3. √7 కరణీయ సంఖ్య అని చూపండి.