Live Silent Think Brilliant......Hardwork gives you Success......ఓర్పు అత్యున్నత నేర్పు.......

Tuesday, March 30, 2021

10th TM-Chapter wise test-అంక శ్రేడి-n'వ పదం-n పదాల మొత్తం

 This worksheet is prepared by 

    BASA RAJA GOPAL 

ఈ worksheet, 10వ తరగతి " శ్రేడులలోని అంక శ్రేడి నుండి Simple Basic and Important Questions తో తయారు చేయబడింది(అంక శ్రేడి -మొదటి పదం-పదాంతరం-సామాన్య భేదం-n'వ పదం-n పదాల మొత్తం).

10th-TM-రెండు చరచాశులలో రేఖీయ సమీకరణాల జత-1

 This worksheet is prepared by 

    BASA RAJA GOPAL 

ఈ worksheet, 10వ తరగతి "రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత" లోని Simple Basic and Important Questions తో తయారు చేయబడింది.

Monday, March 29, 2021

10th EM-Arithmetic Progression-Chapter wise test

 This worksheet is prepared by

BASA RAJA GOPAL 

 This worksheet prepared with Simple Basic and Important Questions from  "Arithmetic Progression" ( First term, Common Difference, nth Term, and Sum to n terms) of 10th class.

Introduction:

An Arithmetic progression is a list of numbers in which each term, except the first term is obtained by adding or subtracting a fixed number to the preceding term.

Sunday, March 28, 2021

10th TM-Chapter wise Test-వర్గ సమీకరణాలు-విచక్షణి-మూలాల స్వభావం

 This worksheet is prepared by 

    BASA RAJA GOPAL 

ఈ worksheet, 10వ తరగతి "వర్గ సమీకరణాలు" లోని Simple Basic and Important Questions తో తయారు చేయబడింది( వర్గ సమీకరణాల సాధనలు, విచక్షణి మరియు మూలాల స్వభావం).

Friday, March 26, 2021

10th-EM-Chapter wise Test-Quadratic Equations-Discriminant

This worksheet is prepared by

BASA RAJA GOPAL 

 This worksheet prepared with Simple Basic and Important Questions from  "Quadratic Equations" ( Discriminant, Roots, Relation between coefficients and Nature of Roots)of 10th class.

Wednesday, March 24, 2021

10th EM-Chapter wise test-Polynomials-Relation between coefficients and zeroes

 This worksheet is prepared by

 BASA RAJA GOPAL 

This worksheet prepared with Simple Basic and Important Questions from  "Polynomials" ( Degree, Values, Zeroes and  Relation between coefficients and Zeroes of Polynomials)of 10th class.

Friday, March 12, 2021

Pass Easy - Question Paper Analysis-10th class(SSC-2023)

ఈ విద్యా సంవత్సరం(2022-2023) లో ‘పదవ తరగతి గణితం (Mathematics)’
 సులభంగా  పాస్ కావడం  ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.
ఈ విద్యా సంవత్సరం(2022-2023) నుండి పదవ తరగతిలో అన్ని Subject లలో రెండు పేపర్ లకి బదులుగా ఒకే పేపర్ ఉంటుంది.
అంటే గణితం (Mathematics)లో కూడ రెండు పేపర్ లకి బదులు ఒకే పేపర్ ఉంటుంది.
So ప్రశ్న పత్రం గురించి పూర్తి అవగాహన ఉంటే పాస్ కావడం Easy.
ఈ నూతన ప్రశ్న పత్రంలో  రెండు భాగాలు ఉండును. అవి Part-A మరియు Part-B.
Part-A కి 60 మార్కులు, 2 గంటల 30 నిమిషాల సమయం కేటాయించబడింది.
అలాగే Part-B కి 20 మార్కులు, 30 నిమిషాల సమయం కేటాయించబడింది.
మొత్తం ప్రశ్నాపత్రం 80 మార్కులు, సమాధానాలు రాయాడానికి 3 గంటల సమయం ఇవ్వబడును.
Part-Aలో మొత్తం 3 విభాగాలు ఉంటాయి. అవి Section-I, Section-II మరియు Section-III.
Section-I లో రెండు మార్కుల ప్రశ్నలు 6, Section-II లో నాలుగు మార్కుల ప్రశ్నలు 6 మరియు Section-III లో ఆరు మార్కుల ప్రశ్నలు 6 ఉండును. ఈ Section-III లోని ఆరు ప్రశ్నలకి నాలుగింటికి మాత్రమే సమాధానాలు రాయల్సి ఉంటుంది .
అదే విధంగా Part-B లో మొత్తం 20 మార్కులకు గాను 20 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఛాయిస్ ఉండదు.
ఈ ప్రశ్నాపత్రంలో జరిగిన మార్పులు మనం తెలుసుకున్నట్లయితే ఈ సంవత్సరం Mathematics పాస్ కావడం చాలా సులభం అవుతుంది.

ప్రశ్నలు అన్నీ కూడ Academic standards వారిగా ఉంటాయి.

Chapter wise వెయిటేజీ ఉండదు.

 ప్రశ్నపత్రంలో జరిగిన మార్పులు వివరంగా తెలుసుకుందాం.

100 మార్కుల గణితం పేపర్ లో 20 మార్కులు నిర్మాణాత్మక మూల్యాంకనం(FA)కి సంబంధించినవి. ఇవి పాఠశాలలో మీరు వ్రాసిన FA-1, FA-2, FA-3 మరియు FA-4 ల ద్వారా వేయబడతాయి. మిగతా 80 మార్కుల కోసం 08-April-2023 శనివారం రోజున ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు పబ్లిక్ పరీక్ష(Board Exam) ఉంటుంది.

80 మార్కుల ప్రశ్న పత్రానికి సమయం 3 గంటలు.

* 80 మార్కుల ప్రశ్నాపత్రంలో 60 మార్కులు పార్ట్-A  మరియు 20 మార్కులు పార్ట్ -B ఉంటుంది.
*60 మార్కుల పార్ట్-A మూడు సెక్షన్‌లుగా ఉంటుంది. సమయం 2 గంటల 30 నిమిషాలు.

👉 సెక్షన్‌ - 1 (12 మార్కులు) 

దీనిలో  6 ప్రశ్నలు ఉంటాయి.

మొత్తం 6 ప్రశ్నలకి సమాధానం రాయాలి.

ప్రతి ప్రశ్నకి 2 మార్కులు. మొత్తం 12 మార్కులు.

మొత్తం 14 అధ్యాయాల(Chapters) నుండి ప్రశ్నలు  ఇవ్వబడును.

👉సెక్షన్‌ -2  (24 మార్కులు) 

ఇందులో  6 ప్రశ్నలు ఉంటాయి.

మొత్తం 6 ప్రశ్నలకి సమాధానం రాయాలి.

ప్రతి ప్రశ్నకి 4 మార్కులు. మొత్తం 24 మార్కులు.

మొత్తం 14 అధ్యాయాల(Chapters) నుండి ప్రశ్నలు ఇవ్వబడును.

👉సెక్షన్‌ -3: (24 మార్కులు) 

దీనిలో  6 ప్రశ్నలు ఉంటాయి.

ఏవేని 4 ప్రశ్నలకి మాత్రమే సమాధానం రాయాలి.

ప్రతి ప్రశ్నకి 6 మార్కులు. మొత్తం 24 మార్కులు.

మొత్తం 14 అధ్యాయాల(Chapters) నుండి ప్రశ్నలు  ఇవ్వబడును.

*PART-B: 20 మార్కులు-సమయం 30 నిమిషాలు ఉంటుంది.

ఇందులో  20 Multiple Choice ప్రశ్నలు ఉంటాయి.

ప్రతి ప్రశ్నకు ఒక మార్కు.

ఇక్కడి 20 ప్రశ్నలు మొత్తం 14 అధ్యాయాలనుండి ఇవ్వబడును.

ఇచ్చిన 4 చాయిస్ లలో సరైన సమాధానాన్ని కొట్టివేత లేకుండా, దిద్దివేయకుండా రాయాలి.

త్వరలో Model Papers "www.mathsbadi.com" లో అందుబాటులో ఉండును.

ఇప్పుడు Chapters వారిగా Important Long Questions(6 Marks) తెలుసుకుందాం

1. వాస్తవ సంఖ్యలు 

* యూక్లీడ్ భాగహార విశేషవిధిని ఉపయోగించి ఒక ధన పూర్ణసంఖ్య యొక్క వర్గం 5p, 5p+1 లేదా 5p+4 రూపంలో ఉంటుందని చూపండి.

* యూక్లీడ్ భాగహార విశేషవిధిని ఉపయోగించి ఒక ధన పూర్ణసంఖ్య యొక్క ఘనం 4p, 4p+1 లేదా 4p+3 రూపంలో ఉంటుందని చూపండి.

√2 + 3√5 ను కరణీయ సంఖ్య అని చూపండి.

(3.5)a = (0.0035)b = 100 అయిన ⅟a - ⅟b విలువ కనుక్కోండి.

2. సమితులు 

* A={x/x అనేది 4 యొక్క గుణిజం మరియు x<20}, B={x/x అనేది 16 యొక్క కారణాంకంఅయిన (A∪B) - (AB) = (A-B) U (B-A) అని చూపండి.

A={x/x అనేది ఒక పూర్ణాంకం మరియు x<10}, B={x/x అనేది ఒక బేసి సంఖ్య మరియు x ≤ 15అయిన A∪B, AB, A-B మరియు B-A లను వెన్ చిత్రంలో చూపండి.

3. బహుపదులు 

* P(x)x2+2x-3 బహుపది రేఖాచిత్రం గీచి, శూన్యాలు కనుక్కోండి.

* వర్గ బహుపది x2-3x+2 కి  శూన్యాలు కనుగొని, శూన్యాలకి గుణకాలకి మద్య సంబంధం సరి చూడండి.

* ఘన బహుపది 2x3 – 5x2– 14x + 8 కి 4, -2 మరియు ½ లు శూన్యాలు అని చూపి, శూన్యాలకి గుణకాలకి మద్య సంబంధం సరి చూడండి.

*ఘన బహుపది   x4  x3 – 11x2– 9x + 18 కి -3 మరియు +3 లు రెండు శూన్యాలు అయిన మిగిలిన రెండు శూన్యాలు కనుక్కోండి.

4. రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత 

5x-y=12 మరియు x-2y=6 సమీకరణాల వ్యవస్థను రేఖా చిత్ర పద్దతి ద్వారా సాధించండి.

* పద సమస్యలను చరరాశి తొలగింపు పద్ధతిలో/ ప్రతిక్షేపణ పద్ధతిలో సాధించుట 

5. వర్గ సమీకరణాలు

* కారణాంక పద్ధతిలో వర్గ సమీకరణాల మూలాలను కనుగొనుట

* విచక్షణి ఆధారిత సమస్యలు

6. శ్రేఢులు

*ఒక అంకశ్రేఢి లోని  6వ మరియు 8వ పదాల మొత్తం 92 మరియు 4వ పదం 25 అయిన ఆ శ్రేఢిలోని మొదటి 20 పదాల మొత్తం కనుగొనుము.

* 60 మరియు 600 ల మధ్యన , 7 చేత భాగించగా శేషం 3 వచ్చు సంఖ్యల మొత్తం కనుగొనుము.

7. నిరూపక రేఖా గణితం

* (4, -4), (-6, 2) మరియు (2, 4) లచే ఏర్పడు త్రిభుజం లంబకోణ సమద్వి బాహు త్రిభుజం అని చూపండి.

* (-2, 2) మరియు (10, -4) లను కలిపే రేఖాఖండానికి సమత్రి ఖండన బిందువులను కనుగొనుము.

👉మిగతా Chapters లోని important Long questions(5 Marks) త్వరలో ఇక్కడే Post చేయబడును.

Thursday, March 11, 2021

Grand Test-SSC-TM-మొదటి నాలుగు పాఠాలు

 ఈ Grand Test ను వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు మరియు రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత నుండి తయారు చేయబడింది.

20 ప్రశ్నలు-20 మార్కులు

పబ్లిక్ పరీక్షలకి మరియు పాలిటెక్నిక్ లాంటి పోటి పరీక్షలకి ఉపయోగపడును.

Grand test-SSC- EM- First four Chapters

This Grand test for 10th class prepared from Real Numbers, Sets, Polynomials and Pair of Linear Equations.

Total 20 questions and 20 Marks

Five questions from Each chapter

Useful to Annual exams and other competitions